Saturday, November 28, 2026

ఏపీలో రాజ్య‌స‌భ స్థానానికి ఈసీ నోటిఫికేష‌న్‌

Must Read

ఏపీలో మరో ఎన్నికకు న‌గారా మోగింది. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయ సాయిరెడ్డి ఇటీవ‌ల త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఈ స్థానం కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సాయిరెడ్డి 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ స్థానానికి ఏప్రిల్ 22 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించ‌నున్నారు. ఏప్రిల్ 30వ తేదీన నామినేషన్లు పరిశీలించి, మే 2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వ‌నున్నారు. మే 9వ తేదీన రాజ్యసభ స్థానానికి ఎన్నికలు నిర్వ‌హించి ఫలితాలు వెల్ల‌డిస్తారు. సంఖ్యా బలం ఆధారంగా ఎంపీ స్థానం కూటమి ప్రభుత్వానికే దక్కే అవకాశం ఉంద‌ని తెలుస్తున్నాది.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూల్స్‌లో బురఖా, నిఖాబ్ నిషేధించిన ఇటలీ

ఇటలీ దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులు ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే బురఖా మరియు నిఖాబ్ వంటి వస్త్రాలను ధరించడాన్ని నిషేధిస్తూ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -