Thursday, July 16, 2026

సైన్యం చ‌ర్య దేశ భ‌ద్ర‌త‌కు నిద‌ర్శ‌నం – సీఎం రేవంత్ రెడ్డి

Must Read

భారత సాయుధ బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్‌కు తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడులు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా సంఘీభావంగా, ఐక్యంగా నిలబడాలని కోరారు. “ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలంగా అండగా నిలుస్తున్నాను. ఉగ్రవాద నిర్మూలన కోసం భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరం వినిపిద్దాం – జై హింద్!” అని రేవంత్‌ పేర్కొన్నారు.

అత్య‌వ‌స‌ర స‌మావేశం…
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక కేంద్రంగా ఉండటంతో, తాజా పరిస్థితులపై, తీసుకోవాల్సిన అప్రమత్త చర్యలపై ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేశారు.తాజా పరిణామాల నేపథ్యంలో ప్రజలెవరూ భయభ్రాంతులకు గురికాకుండా, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -