తెలంగాణ మహిళా యూనివర్సిటీ గతంలో గవర్నర్ వైసీ ఛాన్సలర్ గా ఉండేవారు. కానీ, వీసీగా గవర్నర్ ను తొలగించి, తానే వీసీగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈమేరకు చట్ట సవరణ కూడా చేశారు. అలాగే మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా పేరు మార్చారు. కోటి ఉమెన్స్ కాలేజీ ప్రధాన కేంద్రంగా ఈ యూనివర్సిటీ పనిచేస్తోంది. దీని పరిధిలో 14 పీజీ, 28 యూజీ కాలేజీలు ఉన్నాయి.