పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల్లో ఆయన నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఆ సమయంలో అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30ని పాటించలేదని కేసు ఫైల్ చేశారు. దీంతో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. త్వరలో ఇది విచారణకు రానుంది.