Saturday, November 2, 2024

నమ్మించాడు..! అడవుల్లోకి తీసుకెళ్లి చంపాడు!

Must Read

కడపలో ప్రేమ ఉన్మాది చరిత్ర ఇదే!

మాట్లాడుకుందామని నమ్మించాడు.. తీరా అడవుల్లోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేశాడు. ఇదీ ఇటీవల కడప జిల్లాలో జరిగిన అఘాయిత్యం. ఈ ఘోర హత్య ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీని వెనుక ఉన్న చరిత్ర, అసలు కారణాలు తెలుసుకుందాం.

కడప జిల్లా బద్వేలుకు చెందిన ప్రేమ ఉన్మాది విఘ్నేశ్.. మాయమాటలు చెప్పడంలో దిట్ట. ఇతనికి ఇది వరకు ఓ మహిళతో ప్రేమ వివాహం జరిగింది. ఈక్రమంలో బద్వేలులోనే నివాసం ఉండే ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ప్రేమించాడు. విఘ్నేశ్ పెళ్లి విషయం ఆమెకు తెలిసింది. దీంతో ఆమె, విఘ్నేశ్ ను నిరాకరించి ఒంటరిగా ఉంటోంది. దీంతో విఘ్నేశ్ కోపం పెంచుకున్నాడు. ఈ నెల 19న(శనివారం) ఉదయం 7గంటలకు ఆ బాలిక కాలేజీకి బయలుదేరింది. మార్గ మధ్యలో మైనర్ బాలికను కలిశాడు. బయటికి వెళ్లి మాట్లాడుకుందామని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. బద్వేలు శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమకు ఎదురుగా ఉండే అడవుల్లోకి లాక్కెళ్లాడు. వెళ్తూ.. వెళ్తూ.. పెట్రోల్ బాటిల్ ను కూడా వెంట తీసుకెళ్లాడు. ఆమెపై పెట్రోల్ పోసి, నిప్పు అంటించాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఆ బాలిక మంటల్లో కాలుతూ బోరున విలపించింది. కాపాడండి అంటూ రోడ్డుపైకి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే పూర్తిగా కాలిపోవడంతో కడప రిమ్స్ కి తరలించారు. మృత్యువుతో పోరాడి ఆదివారం ఉదయం కండ్లు మూసింది. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలించి ఆదివారం సాయంత్రం నాటికి పట్టుకున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని జిల్లా ఎస్పీ సమక్షంలో సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అయితే, నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

త్వరలో పాదయాత్ర చేస్తా!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో కచ్చితంగా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -