కరోనా వల్ల అందరికీ ఆరోగ్యం విలువ తెలిసొచ్చింది. హెల్త్ కంటే ఏదీ ముఖ్యం కాదని అందరికీ అర్థమైంది. అందుకే ఇప్పుడు అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ఫోకస్ చేస్తున్నారు. అందుకోసం వ్యాయామం చేయడంతో పాటు మంచి డైట్ ను కూడా పాటిస్తున్నారు. కానీ భోజనంలో పుట్టగొడుగులు లాంటి ఎన్నో పోషకాలు కలిగిన ఫుడ్స్ ను చేర్చుకోవడం లేదు. పుట్టగొడుగులు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. ఇంగ్లీషులో దీన్ని మష్రూమ్స్ అని పిలుస్తారు. ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి. పుట్టగొడుగుల్ని ఎక్కువగా కూర వండుకుంటారు.
బీపీ కంట్రోల్
బరువు తగ్గాలనుకునేవారు పుట్టగొడుగుల్ని తమ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమమని చెప్పొచ్చు. వీటిని తరచూ తీసుకుంటే కొన్ని రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మష్రూమ్స్ తినడం వల్ల మెదడు ఆరోగ్యం మరింత మెరుగుడపడుతుంది. వీటిల్లో పొటాషియం ఎక్కువ స్థాయిలో ఉంది. ఇది బీపీని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేగాక శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా సాయపడుతుంది. యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా కలిగిన పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా అడ్డుకుంటాయి.
హెల్తీగా ఉంచుతాయి
మష్రూమ్స్ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతాయి. పుట్టగొడుగుల వల్ల మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయని జర్నల్ ఆఫ్ మాలెక్యులర్ సైకియారిటీలో పబ్లిష్ అయిన ఓ పరిశోధనా కథనం వెల్లడించింది. మానసిక సమస్యలు, రుగ్మతలను నిరోధించడంలో మష్రూమ్స్ ఎంతగానో సాయపడతాయని సైంటిస్టుల రీసెర్చ్ లో తేలింది. పుట్టగొడుగుల్లో ఉండే సైలోసిబిన్ కు డిప్రెషన్, యాంగ్జైటీతో పాటు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాంటి మానసిక రుగ్మతలను తగ్గించే సామర్థ్యం ఉందట. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం కనుగొన్నారని తెలుస్తోంది.
ఎలుకలపై పరీక్షలు
చిన్న చిన్న డోసుల వారీగా ఎలుకలకు సైలోసిబిన్ ను ఇచ్చి టెస్ట్ చేశారు. ఈ పరీక్షల్లో సైలోసిబిన్ తీసుకున్న తర్వాత ఎలుకల్లో మానసిక ఒత్తిడి, రుగ్మతలకు సంబంధించి మార్పుల్ని గమనించామని సైంటిస్టులు తెలిపారు. అయితే ఈ సైలోసిబిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మరింతగా రీసెర్చ్ చేయాల్సి ఉందని చెప్పారు. మానసిక సమస్యలతో బాధపడే వారికి చేసే చికిత్సలో సైలోసిబిన్ వాడాలా? వద్దా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.