పీరియడ్స్ టైమ్‌లో సెక్స్ చేయొద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..!
స్త్రీలలో నెలసరి అనేది సాధారణ ప్రక్రియ. అయితే ప్రస్తుత కాలంలో కూడా పీరియడ్స్కు సంబంధించి సమాజంలో ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. దీన్ని చాలా మంది మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారు. నెలసరిపై చాలా మందిలో సరైన అవగాహనా ఉండదు. గ్రామీణ ప్రాంతాలతో పాటు చదువుకున్న వాళ్లు అధికంగా ఉండే పట్టణాల్లోనూ నెలసరిపై అనేక అపోహలు, మూఢనమ్మకాలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో నెలసరిపై ఉండే అపోహల్లో ఉన్న వాస్తవికత ఎంత? నిజానిజాలేంటో తెలుసుకుందాం..
మూఢనమ్మకాలను పక్కనపెట్టాలి
పీరియడ్స్ టైమ్లో మహిళలను వంటగది, పూజ గదిలోకి రానివ్వరు. అలాగే వారికి దేవాలయ ప్రవేశమూ ఉండదు. పడక గదిలో అస్సలు నిద్రపోనివ్వరు. భోజనం విషయంలోనూ ఏవేవో షరతులు పెడుతుంటారు. అయితే రుతుస్రావం సమయంలో పెద్దలు చెప్పే ఈ నియమాల్లో మూఢ నమ్మకాలు ఉన్నాయని.. ఇవన్నీ అపోహేలేనని ప్రముఖ గైనకాలజిస్ట్, డాక్టర్ అంజనా సింగ్ అంటున్నారు. మూఢనమ్మకాలను పక్కనపెట్టి సైంటిఫిక్గా ఆలోచించి.. స్త్రీలకు అండగా నిలబడితే నెలసరి సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలను తగ్గించొచ్చని అంజనా సింగ్ సూచిస్తున్నారు. రుతుస్రావంపై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలు, మూఢనమ్మకాలు గురించి ఆమె చాలా క్లుప్తంగా వివరించారు. పీరియడ్స్ సమయంలో మహిళల రక్తం బయటకు వస్తుందని.. ఆ రక్తాన్ని అపరిశుభ్రమైనదిగా భావిస్తారని చెబుతున్నారు అంజనా సింగ్. పీరియడ్స్ సమయంలో ఎన్నో మూఢనమ్మకాలు, ఆచారాలను పాటిస్తూ మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అంజనా సింగ్ అన్నారు.
ఆ టైమ్లో సెక్స్ చేస్తే ఫుల్ రిలీఫ్
నెలసరికి, దైవ నమ్మకాలకు ముడిపెట్టడం ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారామె. మహిళల జీవితంలో పునరుత్పత్తికి నెలసరి అనేది చాలా ముఖ్యమైన అంశమని ఆమె పేర్కొన్నారు. బహిష్టు సమయంలో వచ్చే రక్తాన్ని మురికిదిగా లేదా కలుషితమైనదిగా చూడటం సరికాదన్నారు. ‘పీరియడ్స్ టైమ్లో మహిళలు వ్యాయామం చేయొచ్చు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల వారికి ఎంతో ఊరట లభిస్తుంది. అలాగే కండరాలూ బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. వ్యాయామం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మరింతగా మెరుగుపడుతుంది. పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనాలా? వద్దా అనేది మహిళ, ఆమె భర్త ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. వారికి శృంగారం చేయాలనిపిస్తే నిర్ద్వందగా చేయొచ్చు. దీని వల్ల మహిళలకు ఆరోగ్యపరంగా ఎలాంటి హాని కలగదు. పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొంటే కడుపు నొప్పి నుంచి మహిళలకు కొంత ఉపశమనమూ లభిస్తుంది. అలాగే మూఢనమ్మకాలను పక్కనపెట్టి బహిష్టు టైమ్లోనూ సాధారణ రోజుల్లో ఉన్నట్లే ఉండటాన్ని మహిళలు అలవాటు చేసుకోవాలి’ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.