బెల్లంతో కలిగే ప్రయోజనాలు… బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢత్వంతో పాటు ఊపిరితిత్తులను శుద్ధి చేయడంలోనూ బెల్లం ఉపయోగపడుతుంది. బెల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లంలో ఐరన్ శాతం విరివిగా ఉంటుంది. బెల్లం చెరుకు గడ నుంచి తయారు చేస్తారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో బెల్లం పుష్కలంగా దొరుకుతుంది. తియ్యటి వంటల్లో పంచదార కంటే బెల్లం వేసి వండితే మంచి రుచి వస్తుంది. ఆయుర్వేధంలో కూడా బెల్లాన్ని చాలా రోగాల నివారణకు మందులుగా ఉపయోగిస్తారు. స్త్రీలలో నెలసరి సమస్యలు తగ్గించండంలోనూ బెల్లం ఎంతో ఉపయోగకరం.
Also Read: ఉప్పు వల్ల కలిగే లాభాలు…నష్టాలు…
హిమోగ్లోబిన్ కు బెల్లం అవసరం:
హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేందుకు బెల్లం ఉపయోగపడుతుంది. బెల్లం రోజు ఆహరం తీసుకున్న తర్వాత తింటే అధికబరువును తగ్గిస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు ఆహారం తీసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మెగ్నీషియం, జింక్, పాస్పరస్ కూడా బెల్లంలో పుష్కలంగా ఉంటాయి.
బెల్లం ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు…
డయాబెటిస్ ఉన్న రోగులు బెల్లం ఎక్కువగా తీసుకోకుండా ఉంటడం మంచిది. బెల్లం ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. బెల్లం ఆకర్షనీయంగా కనిపించేందుకు వివిధ రకాల రసాయనాలను వాడవచ్చు. కావున శుభ్రం చేయకుండా బెల్లం తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా బెల్లం తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు. కావున మితంగా బెల్లం తీసుకోవడం మంచిది. బెల్లం ఎక్కువగా తీసుకున్నా మలబద్దకం వస్తుంది. దీంతో పాటు జ్వరం, వికారం, దద్దుర్లు కూడా రావచ్చు.