ఉప్పు వల్ల కలిగే లాభాలు నష్టాలు ఉప్పులో అయోడిన్ ఉంటుంది. ఇది మనిషి ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఉప్పును ప్రతి కూరలోనూ రుచికోసం వాడతారు. ఉప్పువేసిన కూరలు త్వరగా ఉడుకుతాయి. ఉప్పు నీటితో ప్రథమచికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. విషానికి విరుగుడుగా కూడా ఉప్పునీటిని వాడతారు. ఎవరైనా మీ ఉప్పుతిన్న మనిషిని అంటారే కానీ మీ అన్నం తిన్నా అని అనరు. ఉప్పుతో ఎన్నో వస్తువులు తయారవుతాయి.
ఉప్పు తగిన మోతాదులో అందక పోతే..
శరీరంలో అన్ని అవయవాల మెరుగైన పనితీరు కోసం ఉప్పు ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలోనూ ఉప్పు పనిచేస్తుంది. ఉప్పు శరీరానికి తగిన మోతాదులో అందకపోతే పలు శరీర బాగాల్లో వాపు వస్తుంది. ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఉప్పు వల్ల కలిగే నష్టాలు…
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన అధిక రక్తపోటుకు దారితీస్తుంది. గుండె, ఊపిరితిత్తులకు ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక ప్రమాదం ఉంది. ఉప్పు అధికంగా తీసుకోవడం మూలంగా జుట్టుతో పాటు ఎముకలు కూడా బలహీన పడతాయి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.