Thursday, February 13, 2025

వాళ్ల వల్లే బతికా.. హెల్త్ అప్​డేట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

Must Read

వాళ్ల వల్లే బతికా.. హెల్త్ అప్​డేట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఇటీవల గుండెపోటుకు గురయ్యారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ప్రధాన రక్తనాళం చాలా మటుకు మూసుకుపోయిందన్నారు. సరైన టైమ్​లో డాక్టర్లు ట్రీట్​మెంట్ చేయడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. తన హెల్త్ కండీషన్​ను వివరిస్తూ తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. తన మీద ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానం, ప్రేమకు సుస్మిత థ్యాంక్స్ చెప్పారు.

వైద్యం అందించిన డాక్టర్లకు సుస్మితా సేన్ కృతజ్ఞతలు తెలిపారు. ‘రీసెంట్​గా నేను తీవ్రమైన గుండెపోటకు గురయ్యా. అప్పుడు ప్రధాన రక్తనాళం 95 శాతం వరకు మూసుకుపోయింది. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకున్నా. వైద్యుల శ్రమతో నేను ప్రమాదం నుంచి బయటపడ్డా. త్వరలో ‘ఆర్య 3’ షూటింగ్​లో పాల్గొంటా. మీ అందర్నీ మళ్లీ అలరిస్తా’ అని సుస్మిత పేర్కొన్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -