NTR30 నుంచి క్రేజీ అప్డేట్.. జాన్వీ లుక్ కెవ్వు కేక అంటున్న తారక్ ఫ్యాన్స్!
‘ఆర్ఆర్ఆర్’తో పార్ వరల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో తారక్ సరసన హీరోయిన్ ఫిక్స్ అయ్యింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ, దివంగత శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ ‘ఎన్టీఆర్ 30’లో హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. తారక్ సరసన నటించడం తన డ్రీమ్ అంటూ చెబుతూ వచ్చిన ఆమెకు ఇది గోల్డెన్ మూమెంట్ అనే చెప్పాలి. ఈ మూవీలో జాన్వీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. జాన్వీ లుక్ స్టన్నింగ్‌గా ఉందంటూ ఫ్యాన్స్ ట్విట్టర్లో మోత మోగిస్తున్నారు. మార్చి 18 నుంచి ఈ ఫిల్మ్ రెగ్యులర్ షూట్ మొదలుకానుందని సమాచారం.