స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని ఓ పాటపై కాపీ రైట్ కేసులో కీలక తీర్పునిచ్చింది. పిటిషన్‌దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని ఏఆర్ రెహమాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను ఆదేశించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. పొన్నియిన్ సెల్వన్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కించిన రెండో చిత్రం. ఈ మూవీలో విక్రమ్, రవి మోహన్, కార్తి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. పొన్నియిన్ సెల్వన్ -2 చిత్రంలోని వీరా రాజ వీరా అనే పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు సింగర్ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు మధ్యంతర తీర్పునిచ్చింది. ఏఆర్ రెహమాన్, నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లను పిటిషన్‌దారుడికి చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.