Saturday, May 2, 2026

News

మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఎంపిక చేసింది.

కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్వంచల్ ప్రజలపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీజేపీ ఆధ్వర్యంలో పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇంటి వద్దకు చేరుకున్న నిరసనకారులుల.. పూర్వాంచల్ వాసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ...

వివాదంలో సీఎం రేవంత్ సోదరుడు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి కోసం విద్యార్థులతో ప్రత్యేకంగా పరేడ్ నిర్వహించారు అధికారులు.తిరుపతి రెడ్డికి ఎలాంటి హోదా లేకపోయినా ఆయనకు ఎదురు వెళ్లి వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. మరోవైపు పరేడ్ సమయంలో విద్యార్థుల కాళ్ళకు షూస్, చెప్పులు...

టీటీడీ అధికారులపై చంద్రబాబు సీరియస్

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో టీటీడీ ఈవో, జేఈవో గౌతమీపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి. మీరు సమాధానం చెప్పండి. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారని అధికారులను ప్రశ్నించారు. అలాగే 'ప్రతి ఒక్కరికి చెప్తున్నా.. పద్ధతి ప్రకారం నడుచుకోండి....

సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి

సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 13 నుంచి 23 వరకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ...

సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ఊరట

జర్నలిస్ట్‌‌పై దాడి కేసులో హీరో మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారించగా.. ఆయన...

ఏసీబీ విచారణ ఎదుట హాజరైన కేటీఆర్‌

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.10 గంటలకు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్ వెంట న్యాయమూర్తి రామచంద్రరావు ఉన్నారు. అయితే, ఈ కేసు విచారణ సమయంలో తన వెంట లాయర్‌ను తీసుకెళ్లేందుకు కేటీఆర్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది....

తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.‘తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఎస్పీ వెంటనే సిబ్బందితో...

‘గేమ్ ఛేంజర్’కి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 4 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిస్తూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 11 నుంచి...

ఢిల్లీ ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిందని తెలిపారు. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ది మోదీతోనే సాధ్యమని చెప్పారు. సంక్షేమం సుపరిపాలనతో మోదీ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు....

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...