Monday, November 4, 2024

ఆఫీసుకు రావొద్దు.. ఇంట్లో నిద్రపోండి.. ఎంప్లాయీస్‌కు కంపెనీ సర్‌‌ప్రైజ్ గిఫ్ట్!

Must Read

ఆఫీసుకు రావొద్దు.. ఇంట్లో నిద్రపోండి.. ఎంప్లాయీస్‌కు కంపెనీ సర్‌‌ప్రైజ్ గిఫ్ట్!

పొద్దున ఆఫీసుకు వెళ్తే సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాం. నిర్ణీత పనివేళల్లో మన దగ్గర నుంచి ఎంత పనిని రాబట్టాలో అంతా రాబడతాయి కంపెనీలు. పనిలో బాగా అలసిపోయి ఒక 5 నిమిషాలు కునుకుతీద్దామన్నా అస్సలు ఒప్పుకోవు. అలా చేస్తే సంస్థ కంటే ముందు సహోద్యుగులే మనపై ఫిర్యాదులు చేస్తారు. ఇక, రాత్రి పూట ఫ్యామిలీతో గడపడం, పొద్దున లేచి మళ్లీ కార్యాలయాలకు పరిగెత్తడం.. దీంతో చాలా అలసిపోతున్నారు.

దాదాపుగా అందరి ఉద్యోగుల పరిస్థితి ఇంతే. అవిశ్రాంతంగా పనిచేస్తూ అలసిపోతున్నారు. కంటికి విరామం ఉండకపోవడంతో పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ తమ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. హఠాత్తుగా వారికి సెలవు ప్రకటించింది. హాయిగా ఇంట్లోనే నిద్రపోండి అని చెబుతోంది. గిఫ్ట్ ఆఫ్ స్లీప్‌గా దీని గురించి చెబుతూ తన లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో వివరించింది. అయితే ఇది ఆప్షనల్ అని.. రావాలనుకున్న ఎంప్లాయీస్ మాత్రం ఆఫీసులకు రావొచ్చని చెప్పింది.

వీకెండ్ కాదు.. పండగలేం లేవు.. మరి, ఆ కంపెనీ ఇలా ఎందుకు చేసిందనుకుంటున్నారా? ప్రపంచ నిద్ర దినోత్సవం (మార్చి 17) సందర్భంగా తమ ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, వెల్‌నెస్ మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే ఇలా సెలవు ప్రకటించినట్లు బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే సంస్థ వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ ఉద్యోగులు తమ యాజమాన్య నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘పండుగలా జరుపుకుంటున్నాం’
ఈ వేక్‌ఫిట్ సొల్యూషన్స్ ను డైరెక్ట్ టు కన్జూమర్ హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్టప్ సంస్థగా చెప్పొచ్చు. వరల్డ్ స్లీప్ డే సందర్భంగా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నట్లు లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయడం సహా ఎంప్లాయీస్కు ఈ విషయాన్ని మెయిల్ చేసింది వేక్ఫిట్. ‘సర్‌ప్రైజ్ హాలీడే. అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్’ అని ఆ మెయిల్‌లో పేర్కొంది వేక్ఫిట్. ఈ వరల్డ్ స్లీప్ డేను పండుగలా పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది వేక్‌ఫిట్ సంస్థ.

పనివేళల్లో కునుకు అవసరమే!
గతేడాది కూడా వేక్ఫిట్ ఓ కీలక ప్రకటన చేసింది. రైట్ టు నాప్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ కింద కంపెనీ ఎంప్లాయీస్ను పనివేళల్లో 30 నిమిషాలు కునుకు తీసేందుకు అనుమతి ఇచ్చింది. బాడీని రీఛార్జ్ చేయడంలో, మళ్లీ చేస్తున్న పని మీద దృష్టిని కేంద్రీకరించడంలో మధ్యాహ్నపు నిద్ర ఉపకరిస్తుందని పేర్కొందీ సంస్థ. హోమ్ ఫర్నీషింగ్ ప్రొడక్ట్స్‌కు సంబంధించి వేక్‌ఫిట్ సొల్యూషన్స్ మంచి పేరు తెచ్చుకుంది. ఇక నిద్రలేమి వల్ల కలిగే రోగాలను దృష్టిలో పెట్టుకొని ఈ వేక్ఫిట్ వాటిపై ప్రజలకు, తమ ఎంప్లాయీస్కు అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

మంత్రి సుభాశ్ కు చంద్రబాబు వార్నింగ్!

ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. మంత్రి పనితీరు, సభ్య నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -