చాట్‌బోట్స్ వచ్చేస్తున్నాయ్.. ఇక, ఆ 20 రకాల ఉద్యోగాలు డేంజర్‌లో..!
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ లాంటి ప్లాట్‌ఫామ్స్ వల్ల మనుషుల జాబ్స్ డేంజర్లో పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎంప్లాయీస్ స్థానాల్ని ఏఐ చాట్‌బోట్‌లు ఆక్రమించగా.. ఫ్యూచర్లో ఇండియా వంటి దేశాల్లో వీటి వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతుందంటూ మార్కెట్ పరిశోధనా సంస్థ గార్ట్‌నర్ చెప్పింది. తాజాగా చాట్‌బోట్స్ కారణంగా ఏయే రంగాల ఉద్యోగాలకు ఎసరు వస్తోందో తెలుపుతూ పలు రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి.
కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..
రెస్యూమ్ బిల్డర్ అనే కంపెనీ ఇటీవల ఆయా రంగాలకు చెందిన వ్యాపార వ్యవహారాల్లో విశేషంగా రాణిస్తున్న 1,000 మంది బిజినెస్ లీడర్స్‌తో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో యూఎస్లో ఉన్న సగానికిపై సంస్థలు ఉద్యోగుల స్థానాన్ని చాట్‌బోట్స్ భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపాయి.
ఉద్యోగుల్లో మొదలైన భయాలు
ఒక్క అమెరికాలోనే కాకుండా వరల్డ్వైడ్గా అనేక రంగాల్లో చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు పట్టుకున్నాయి. కానీ చాటీజీపీటీని రూపొందించిన మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మాత్రం.. చాట్ జీపీటీ ఎంప్లాయీస్ స్థానాలను ఆక్రమించబోదని చెప్పింది. ఉద్యోగులకు సాయం చేసేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
రిలీజైన జీపీటీ-4
ఓపెన్ ఏఐ కంపెనీ చాట్ జీపీటీకి అప్‍డేటెడ్ వెర్షన్ జీపీటీ-4ను రిలీజ్ చేసింది. ప్రస్తుత చాట్‍జీపీటీ-3.5 కన్నా ఇది మరింత స్పీడ్గా, కచ్చితత్వంతో జవాబులు చెబుతుండడంటంతో దాని పనితీరుపై యూజర్లలో ఆసక్తి మొదలైంది. అందుకే ఈ లేటెస్ట్ వెర్షన్ వల్ల ఎంప్లాయీస్కు నష్టం వాటిల్లుతుందా? చాట్ జీపీటీని అడిగాడో యూజర్. ట్విటర్ యూజర్ ప్రశాంత్ రంగస్వామి చాట్‌జీపీ-4ని పైక్వశ్చన్ అడిగాడు. రంగస్వామి క్వశ్చన్కు రిప్లయ్ ఇస్తూ 20 రకాల ఉద్యోగాల్లో మనుషులకు ప్రత్యామ్నాయంగా చాట్‌జీపీటీ-4 పనిచేస్తుందని బదులిచ్చింది.
ఆ 20 రకాల ఉద్యోగాలు ఇవే..
డేటా ఎంట్రీ క్లర్క్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటీవ్, ప్రూఫ్ రీడర్, పారా లీగల్, బుక్ కీపర్, ట్రాన్స్లేటర్, కాపీ రైటర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, అపాయింట్మెంట్ షెడ్యూలర్, టెలీ మార్కెటర్, వర్చువల్ అసిస్టెంట్, ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్, న్యూస్ రిపోర్టర్, ట్రావెల్ ఏజెంట్, ట్యూటర్ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్, ఈ-మెయిల్ మార్కెటర్, కంటెంట్ మోడరేటర్, రిక్రూటర్ లాంటి ఉద్యోగాల్ని రిప్లేస్ చేస్తుందని పేర్కొంది.