Tuesday, April 28, 2026

మూసీ ప్రక్షాళనలో భారీ స్కామ్!

Must Read

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళన వెనుక భారీ స్కామ్ ఉందని ఆరోపించారు. 2400 కిలోమీటర్ల మేర ఉన్న గంగా నది ప్రక్షాళనకు కేవలం రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తే.. 55 కిలోమీటర్లు మాత్రమే ఉన్న మూసీ నది ప్రక్షాళనకు రూ.లక్షన్నర కోట్లు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు. మూసీ పరిసర ప్రాంతాల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందన్నారు. పర్మిషన్లు ఇచ్చిన అధికారులను వదిలిపెట్టి పేదలపై ప్రతాపం చూపడం ఏంటని ప్రశ్నించారు. పేదలకు ఇండ్లతో పాటు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే వారి ఇండ్లను ముట్టుకోవాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామన్నారు. కూల్చే పరిస్థితులు వస్తే ముందు హుస్సేన్ సాగర్ నాలా మీదున్న హైడ్రా కార్యాలయాన్ని కూల్చాలని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -