బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేపథ్యం లేని మహిళలను ఇన్‌ఛార్జ్‌లుగా తీసుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఉన్న నేతల కుటుంబాల్లోని మహిళలకు పదవులు ఇస్తే చివరకు ఒకే కుటుంబానికి అధికారం దక్కడం ఖాయమని ఆ పార్టీ భావిస్తోంది. ఇక పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.