Saturday, March 15, 2025

తిరుమల లడ్డూ వ్యవహారం..చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు

Must Read

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈక్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ‘లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్ కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవు.’ అని పేర్కొంది. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ‘చంద్రబాబు విచారణకు ఆదేశించినట్లు అయితే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంది? రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, ఎలాంటి ఆధారం లేని ఆరోపణలు చేయడం తగదు. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. నెయ్యి కల్తీ జరిగిందో లేదో తెలియనప్పుడు.. ప్రెస్ కు కల్తీ జరిగిందని ఎందుకు చెప్పారు? ’ అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -