భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది ఇస్రో. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ఈరోజు (గురువారం) ఎక్స్ వేదికగా వెల్లడించింది. గత డిసెంబర్ 30న షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ 60 పీఎస్‌ఎల్వీలో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది.