Sunday, December 7, 2025

ఓటుకు నోటు.. విచారణకు రావాల్సిందే!

Must Read

నాంపల్లి కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 16న కోర్టులో హాజరు కావాలని ఉత్తర్వులిచ్చింది. నాంపల్లి కోర్టులో ఈ రోజు ఈడీ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితులైన వారిలో ఒకే ఒక్కరు ముత్తయ్య విచారణకు హాజరయ్యారు. మిగిలిన నిందితులైన రేవంత్ రెడ్డి, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని సదరు నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వచ్చే నెల 16న మాత్రం విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -