బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం కొనసాగనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలో ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి...
నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,...
కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయం, దౌల్తాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గీలోని శివాలయం, వేణుగోపాల స్వామి వారి ఆలయాలను సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా చాలా గొప్పగా అభివృద్ధి చేయాలని...
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రానున్నారని ఆయన మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఏలేటి, “రేవంత్ రెడ్డి నువ్వు ఒక బచ్చా… ప్రధాని నరేంద్ర మోదీని దింపడం నీ తరం కాదు. నీ అవినీతి చిట్టా అంతా...
రాఖీ పండగ వాతావరణంతో రాష్ట్ర రాజధాని సందడిగా మారింది. సోదరులకు రాఖీ కట్టేందుకు స్వగ్రామాలకు వెళ్లే అక్కాచెల్లెళ్లు పెద్ద సంఖ్యలో బయల్దేరుతున్నారు. దీంతో నగరంలోని ముఖ్య బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మియాపూర్, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, మహాత్మాగాంధీ బస్టాండ్, జూబ్లీ బస్టాండ్ వంటి కేంద్రాల్లో ఉదయం నుంచి రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని...
తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలో పాఠశాలలు, కళాశాలలకు వరుసగా మూడు రోజుల సెలవులు లభించాయి. ఆగస్టు 8వ తేదీ శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా, ఆగస్టు 9వ తేదీ రాఖీ పౌర్ణమి రోజు రెండో శనివారం కావడంతో ఆ రోజు కూడా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఆ తర్వాతి రోజు, ఆగస్టు 10వ...
ప్రైవేట్ రంగంలోని డ్రైవర్లకు ఇచ్చే రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు రేవంత్ రెడ్డి ఆకర్షణీయ హామీలు ఇచ్చినా, గద్దెనెక్కాక ఉన్న పథకాలనే రద్దు చేసి ప్రజలను...
తెలంగాణలో బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గించేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల హక్కులను హరించే కుట్రలో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని...
ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ దండయాత్ర చేయనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు (ఆగస్టు 7) నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని పలుచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు...
స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని పరిమితి విధిస్తూ చేసిన చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు కూడా...
ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...