Thursday, July 16, 2026

#telangana

మీడియాతో మాట్లాడొద్దని కొండా సురేఖకు ఏఐసీసీ సూచన

తెలంగాణ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరిద్దామని సూచించినట్లు తెలిసింది.కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను ఇటీవల బాధ్యతల నుంచి తొలగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గట్టి...

వరంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు నగరంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్‌ ద్వారా వరంగల్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ...

ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహం: రైతులకు ఉచిత విత్తనాలు

తెలంగాణలో రైతులు నూనె గింజలు మరియు ఆయిల్‌పామ్ పంటల సాగును పెంచాలని, ఈ పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు, జాతీయ నూనె గింజల పథకం కింద 2025-26 సంవత్సరానికి...

మునుగోడులో మద్యం దుకాణాలకు కోమ‌టిరెడ్డి నిబంధనలు!

తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నడుస్తున్న వేళ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించినట్లు ఆయన తెలిపారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు గ్రామాల బయట మాత్రమే షాపులు పెట్టాలని, సిట్టింగ్ సౌకర్యాలు...

సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరిచిన బీజేపీ : పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) బలహీనపరిచి, అవినీతిని బహిర్గతం చేసే కార్యకర్తలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శులు అల్లం భాస్కర్‌, మధుసత్యం గౌడ్‌, కొమురయ్యలతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఆయన...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రేపే నోటిఫికేషన్!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 13న‌ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రేపటి నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న, ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు అవకాశం కల్పించారు. ఈ ఉప ఎన్నిక కోసం షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో...

వరంగల్ రాజకీయాల్లో పొంగులేటి జోక్యం: కొండా సురేఖ ఫిర్యాదు

వరంగల్ జిల్లా రాజకీయాల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, ఆయన పెత్తనం మితిమీరిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు ఆమె భర్త కొండా మురళి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. శనివారం జరిగిన ఈ ఫిర్యాదును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయానికి నేరుగా ఫోన్...

బీసీ రిజర్వేషన్ల‌పై సుప్రీంకు తెలంగాణ స‌ర్కార్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్‌ అమలు జీవో 9ను హైకోర్టు స్టే చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ ఆర్డర్‌ను ఎత్తివేయాలని, ఎన్నికల నోటిఫికేషన్‌ను అమలు చేయడానికి అనుమతించాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశంలో చర్చించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది...

42 శాతం బీసీ రిజర్వేషన్‌తోనే స్థానిక ఎన్నికలు: మంత్రి పొన్నం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఈ నిర్ణయానికి...

రేపే స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు (గురువారం) ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడినప్పటికీ, నోటిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి, కానీ నోటిఫికేషన్‌ను ఆపాలన్న పిటిషనర్...
- Advertisement -spot_img

Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -spot_img