Friday, April 17, 2026

కొడంగ‌ల్ ఆల‌యాల అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు

Must Read

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాలను ఉన్నతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయం, దౌల్తాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గీలోని శివాలయం, వేణుగోపాల స్వామి వారి ఆలయాలను సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా చాలా గొప్పగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.కొడంగల్ నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధి, తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. కొడంగల్‌లోని చారిత్రక శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలకు ఈ సందర్భంగా ఆమోదించారు.ఈ ఆలయ ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్లు, ముఖ్యంగా ప్రాకార మండపం, మాడ వీధులు, భూ వరాహస్వామి దేవాలయం, గర్భగుడి, మహామండప డిజైన్లలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.అలాగే, దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. రాతి కట్టడాలతో ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -