ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం అధికారులు కొత్త మార్గదర్శకాలు అమలు చేయనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని స్పష్టంచేశారు. సంప్రదాయ వేషధారణ లేకపోతే ఆలయ ప్రవేశం నిరాకరించబడుతుందని తెలిపారు. ఇకపై ఆలయ ప్రాంగణంలో సెల్‌ఫోన్ల వాడకం పూర్తిగా నిషేధించబడింది. అంతరాలయంలో వీడియోలు తీసి...
వైసీపీ పునాదులను మరింత బలపరిచే బాధ్యత జిల్లా ప్రధాన కార్యదర్శులదే అని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, పూడి శ్రీహరి,...
రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాల పురోగతి, ప్రజల స్పందనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద చేపట్టిన ర్యాలీలు, కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. అలాగే ఉచిత బస్సు సేవపై అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం వైపు దూసుకెళ్తోంది. బలమైన రుతుపవన గాలులు తోడవడంతో వాతావరణం మరింత ఉధృతమవుతోంది. ఈనెల 19న తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే కుండపోత వర్షాలు కురుస్తుండగా, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్...
పులివెందుల ఉప ఎన్నికల గురించి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. ప్రతి కార్యక్రమాన్నీ వైసీపీపై బురదజల్లే వేదికగా మార్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ఇంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా చూడలేదని, ఓటు హక్కు వినియోగించిన ప్రజలను...
ఆంధ్రప్రదేశ్‌లో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో జరిగిన అక్రమాలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్ ఆరోపణల ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, అధికారులను ఉపయోగించి ఎన్నికలను “హైజాక్” చేశారని విమర్శించారు.ఈ ఘటన రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలో “బ్లాక్ డే”గా...
ఏపీ ప్రభుత్వం ఆగస్టు 14న విడుదల కానున్న ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ చిత్రానికి ప్రత్యేక సడలింపులు ఇచ్చింది. రిలీజ్ డే ఉదయం 5 గంటలకు ప్రీమియర్ షో నిర్వహించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా, సినిమా విడుదల రోజు నుండి ఆగస్టు 23 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్...
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఆస్తి కోసం కన్న తల్లిపైనే కొడుకు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన జక్కు లక్ష్మీనరసమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురికి పెళ్లయి చాలాకాలమైంది. భర్త మృతి చెందడంతో ఆమె తన ఇల్లు వదిలి వేరే చోట నివసిస్తోంది. కొడుకు శివాజీకి కూడా...
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు జరిగాయి. హాజరు శాతం 92.90గా నమోదైంది. పరీక్షలను ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా...
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల మార్పు చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పుల వెనుక ఉద్దేశ్యంపై వైఎస్‌ఆర్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ, “పోలీసుల సహకారంతో రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ కేంద్రాలను మార్చారా?” అని ప్రశ్నించారు. నల్గొండవారిపల్లె గ్రామ ఓటర్లు ఇప్పుడు తమ ఓటు...
బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...