Sunday, May 31, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఉగ్ర సంబంధాల‌తో ఇద్దరు మైనర్ల అరెస్ట్

Must Read

దిల్లీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఇద్దరు మైన‌ర్ల‌ను ఉగ్రవాద నిరోధక దళం అదుపులోకి తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరు బాలురు పాకిస్తాన్‌లో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాల మేరకు నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఉగ్రవాద భావజాలం ప్రచారం చేస్తున్నారు. స్థానిక యువకులను రాడికలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. భారత్‌లో మైనర్లను ఉగ్రవాదంలోకి తీసుకురావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. రాయ్‌పూర్‌తో పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -