– సంచలన విషయాలు బయటపెట్టిన ప్రముఖ జర్నలిస్ట్ నితీష
– తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారిన “డార్క్ సీక్రెట్” మ్యాగజైన్
– హైదరాబాద్ ఐటీ గురించి ఆధారాలతో సహా బయటపెట్టిన వైనం

హైదరాబాద్ ఐటీ చరిత్ర గురించి ప్రముఖ జర్నలిస్టు, రీసెర్చ్ స్కాలర్ అరికెపూడి నితీష సంచలన విషయాలు బయటపెట్టారు. ఆనాటి సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా “DARK SECRETS” పేరుతో మ్యాగజైన్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ కు ఐటీని తీసుకురావడంలో ఎవరి పాత్ర ఎంత ఉంది? అనే దానిపై ఆధారాలతో తెలియజేశారు. చరిత్రను వక్రీకరించిన తీరును పూసగుచ్చినట్లుగా వివరించారు. ఐటీ పేరుతో హైదరాబాద్ లో జరిగిన అక్రమాలు సైతం బయటపెట్టారు.

సంచలనం రేపుతున్నకథనం..
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పలువురు ఐటీ ఉద్యోగులు ధర్నాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో హైదరాబాద్ ఐటీపై విస్త్రత చర్చ జరుగుతోంది. టీడీపీ వర్గాలు హైదరాబాద్ కు ఐటీని తీసుకొచ్చింది చంద్రబాబేనని దానివల్లే హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని చెబుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని, ఆ క్రెడిట్ అంతా మాజీ ముఖ్యమంత్రి ఎన్. జనార్ధన్ రెడ్డికే దక్కుతుందని చెబుతున్నారు. ఈక్రమంలో అరికెపూడి నితీష రాసిన కథనం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఇంతకీ ఆ మ్యాగజీన్ లో ఏముందో ఇప్పుడే చదవండి.




















