Saturday, March 15, 2025

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే!

Must Read

ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన పార్టీగా బీజేపీ.. దాని సక్సెస్ సీక్రెట్ ఇదే!

ప్రపంచంలో వందలాది దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఎన్నో శక్తిమంతమైన పార్టీలు, పెద్ద పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఏది అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ అనేది చెప్పలేని పరిస్థితి. దీని గురించి వాల్స్ట్రీట్ జర్నల్లో ఓ కథనం ప్రచురితమైంది. ఆ ఆర్టికల్ రాసిన రచయిత వాల్టర్ రస్సెల్ మీడ్ ప్రకారం.. వరల్డ్లోనే అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ బీజేపీనట.

Read More: అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్

వచ్చే ఎన్నికల్లోనూ ఫలితాలు రిపీట్

బీజేపీనే అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ అని వాల్టర్ రస్సెస్ అన్నారు. అయితే ఈ విషయాన్ని చాలా తక్కువ మందే అర్థం చేసుకోగలరని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో రస్సెల్ పేర్కొన్నారు. బీజేపీ 2014, 2019 సంవత్సరాల్లో వరుస విక్టరీలు సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీ అని.. అదే గెలుపును 2024లో పునరావృతం చేసి విజయపథంలోకి దూసుకుపోతుందని రస్సెస్ చెప్పారు. ఇండియా ఆర్థిక శక్తిగా వేగంగా ఎదుగుతోందన్న ఆయన.. జపాన్‌తో పాటు అమెరికా వ్యూహ రచనలోనూ ఈ దేశం అగ్రగామిగా నిలుస్తోందని తన జర్నల్‌ ప్రచురణలో స్పష్టం చేశారు.

వారి వల్లే ఈస్థాయిలో..!

ఫ్యూచర్లో పెరుగుతున్న చైనా శక్తిని సమతూకం చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు లాంటి వాటితో సంబంధం లేకుండానే.. భారత్‌లోని బీజేపీ తనదైన శైలిలో దూసుకుపోతోందని రస్సెస్ తన జర్నల్లో రాసుకొచ్చారు. భారతీయేతరులందరికీ బీజేపీ పొలిటికల్, కల్చరల్ హిస్టరీ నుంచి ఎదుగుతున్న విషయం తెలియదని రచయిత అభిప్రాయపడ్డారు. బీజేపీ ఒకప్పుడు గమ్యం లేకుండా అస్పష్టమైన సామాజిక ఉద్యమంలా సాగేదన్నారు రస్సెస్. కానీ బీజేపీని సామాజిక ఆలోచనాపరులు, కార్యకర్తలు తమ కృషితో ఆధునికీకరణ వైపు నడిపారని చెప్పారు. బీజేపీ కోసం విలక్షణమైన హిందూ మార్గాన్ని తయారు చేసి.. ఎన్నికల్లో గెలుపును అందుకుని ఆధిపత్యం వహించే స్థాయికి ఎదిగేలా చేశారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వివరించింది.

ముస్లింల మద్దతు బోనస్

చైనా మాదిరిగా బిలియన్ కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న భారత్ను ప్రపంచ సూపర్‌ పవర్‌గా ఎదిగేలా చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇజ్రాయెల్‌లోని లికుడ్‌ పార్టీలా బీజేపీ వ్యవహరిస్తోంది. లికుడ్లాగే కాస్మోపాలిటన్‌, పాశ్చాత్య కేంద్రీకృత సాంస్కృతిక, రాజకీయ ప్రముఖుల ఆగ్రహానికి బీజేపీ గురైంది. కానీ వాక్చాత్యుర్యం, సంప్రదాయవాద విలువలతో పాటు ఆర్థిక వైఖరిని మిళితం చేస్తూ బీజేపీ దూసుకెళ్తోందని రస్సెస్ చెప్పారు. ఈశాన్య భారతంలో క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి గెలిచిందని రస్సెల్ తెలిపారు. అంతేగాదు ఇండియాలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు షియా ముస్లింల నుంచి బలమైన మద్దతు పొందిందని ఆయన గుర్తు చేశారు.

Must Read: గవర్నర్‌ను నిజంగా అవమానించారా? టీడీపీ, ఈనాడు సెల్ఫ్‌గోల్!

వాళ్లంతా మోడీ వారసులే

గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం నుంచి మతపరమైన విద్య వరకు అన్ని పనులను.. ఆయా వర్గాల నుంచి వచ్చిన వాలంటీర్లే నిర్వహించేలా చేసి ప్రజాశక్తిని తనపై కేంద్రీకరించేలా చేసుకుని బీజేపీ విక్టరీ కొట్టింది. ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో సహా అంతా మెడీ వారసులుగానే మాట్లాడతారని రస్సెస్ తన జర్నల్లో రాసుకొచ్చారు. ఏదేమైనా అట్టడుగున ఉన్న ఉద్యమానికి చెందిన లీడర్షిప్ అత్యంత శక్తిమంతంగా ఎదగాలని బీజేపీ కోరుకుంటోంది. ఆ స్థానాన్ని నిలబెట్టకోవాలని బలంగా భావిస్తోందని రస్సెల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -