కొబ్బరి చిప్పలతో లక్షలు సంపాదించొచ్చు.. ఎలా అంటే?
మన రోజువారీ జీవితంలో ఎన్నో వస్తువులను చూస్తుంటాం. చాలా వాటిని నిరుపయోగంగా భావిస్తుంటాం. కానీ వాటిల్లో ఎక్కువ శాతం నిరుపయోగమైనవే కావొచ్చు గానీ కొన్ని మాత్రం చాలా పనికొస్తాయి. మనకు తెలియనంత వరకు ఏదైనా నిరుపయోగమనే అనొచ్చు. ఈ విధంగా అవసరం అనుకున్న వస్తువులను సరైన క్రమంలో వినియోగించడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే ఇంట్లో ఉండే గృహిణులు ఇలా నిరుపయోగంగా ఉండే వస్తువులను చాలా తెలివిగా వాడటాన్ని చూడొచ్చు.
కొబ్బరి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. కొబ్బరితో చట్నీలు కూడా చేసుకుంటాం. కానీ కొబ్బరి తిన్నాక చిప్పను మాత్రం బయట పడేస్తాం. అయితే కొబ్బరి చిప్ప వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కొబ్బరి చిప్పలను విసిరేయకుండా.. వాటిని కొన్ని విధాలుగా ఉపయోగించొచ్చు.
గృహాలంకరణకు బెస్ట్
రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ఎగ్జిబిషన్‌కు హాజరైన మహారాష్ట్రకు చెందిన స్టార్టప్ డైరెక్టర్ హేమలత ఈ విషయంపై కీలక సూచనలు చేశారు. కొబ్బరి తొక్కలతో ఇంట్లోనే అనేక రకాల వస్తువులను తయారు చేసుకోవచ్చని ఆమె చెప్పారు. కొబ్బరి చిప్పలతో గిన్నెలు, ప్లేట్లు, కుండలు, శిల్పాలు ఇలా ఎన్నో వస్తువులను తయారు చేసి ఇంట్లో అలంకరించుకోవచ్చు.
గృహిణులకు ఉపాధి
సొంత స్టార్టప్ ద్వారా చేనేత కళలు, డోర్ మేట్ సహా 200 రకాల ప్రాడక్ట్స్ను రూపొందిస్తున్నట్లు హేమలత తెలిపారు. ఈ స్టార్టప్లు ఇంట్లో కూర్చునే మహిళలకు ముడిసరుకును అందించడంతో పాటు వివిధ ప్రాడక్ట్స్ను తయారు చేయడం ద్వారా వారికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి.
ప్లాస్టిక్ వస్తువుల స్థానంలోకి యువతి కొబ్బరి చిప్పలను ఉపయోగించడం చాలా బెస్ట్ అనే చెప్పాలి. వీటిని ఎంతో న్యాచురల్గా రూపొందించడం వల్ల వీటిలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకున్నా కూడా ఎలాంటి హాని కలగదు.