Sunday, April 13, 2025

సైంటిస్టుల అరుదైన ఘనత.. రెండు మగ ఎలుకల నుంచి సంతానం.. ఇక మనుషులపైనే!

Must Read

సైంటిస్టుల అరుదైన ఘనత.. రెండు మగ ఎలుకల నుంచి సంతానం.. ఇక మనుషులపైనే!

సంతానోత్పత్తిపై అనేక దేశాల్లోని శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజగా జపాన్​ సైంటిస్టులు ఒక అరుదైన ఘనత సాధించారు. రెండు మగ ఎలుకల నుంచి వాళ్లు ఓ సంతానాన్ని ఉత్పత్తి చేశారు. జపాన్‌లోని క్యుషు, ఒసాకా యూనివర్సిటీల సైంటిస్టుల టీమ్ ఈ ఘనతను సాధించింది. పురుష జీవుల చర్మ కణాల్లో నుంచి అండాలను సేకరించి ఈ ఎలుకలను తయారు చేసినట్లు ది గార్డియన్ న్యూస్ పేపర్ నివేదించింది. మానవుల్లో కొత్త సంతానోత్పత్తి ట్రీట్​మెంట్​లకు ఇది దోహదపడే అవకాశం ఉందని తెలిపింది.

‘ఈ పద్ధతి ఇద్దరు పురుషులు కలసి పిల్లల్ని కనేందుకు ఉపయోగపడుతుంది. టర్నర్స్ సిండ్రోమ్ లాంటి సంతానోత్పత్తి చికిత్సకూ ఇది దోహదపడుతుంది. ఒకవేళ ఎక్స్​ క్రోమోజోమ్​ పూర్తిగా, పాక్షికంగా మిస్సయినా.. ఈ పద్ధతిలో సక్సెస్​ఫుల్​గా ట్రీట్​మెంట్ చేయొచ్చు. పురుష అండాలను వినియోగించి ఒక బలమైన క్షీరదాన్ని క్రియేట్ చేయడం ఇదే తొలిసారి’ అని క్యుషు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త కట్సుహికో హయాషి తెలిపారు.

హ్యూమన్​ జీనోమ్ ఎడిటింగ్​ మీద జరిగిన మూడో ఇంటర్నేషనల్ సమ్మిట్​లో ఈ కీలక పురోగతికి సంబంధించిన నివేదికనను హయాషి సమర్పించారు. లండన్​లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్​లో ఈ సమ్మిట్ జరిగింది. గతంలోనూ సైంటిస్టులు సాంకేతికంగా ఇద్దరు బయెలాజికల్​గా ఫాదర్స్ నుంచి ఎలుకను సృష్టించారు. తల్లుల నుంచీ సృష్టించారు. కానీ రెండు మగ ఎలుకల కణాల నుంచి అండాలను సృష్టించడం మాత్రం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

ఈ పద్ధతిలో అసలేం చేస్తారంటే..!

‘ఇండుసెడ్​ ప్లూరిపోటెంట్ స్టెమ్ (ఐపీఎస్​) కణాలను సృష్టించడానికి మగ చర్మ కణాలను స్టెమ్ సెల్ వంటి స్థితికి రీప్రోగ్రామ్ చేసింది సైంటిస్టుల బృందం. తర్వాత వై క్రోమోజోమ్​ను తొలగించింది. అనంతరం ఎక్స్​ క్రోమోజోమ్​తో దాన్ని రీప్లేస్​ చేసింది. ఈ ఎక్స్​ క్రోమోజోమ్​ను మరొక సెల్ నుంచి తీసుకున్నారు. రెండూ ఒకేలా ఉండే ఎక్స్​ క్రోమోజోమ్‌లతో ఐఫీఎస్​ కణాలను ఉత్పత్తి చేసేందుకు దీన్ని తీసుకుంటారు’ అని రిపోర్ట్​ ద్వారా వెల్లడైంది. అంటే రీసెర్చ్​లో మగ ఎలుక చర్మ కణం నుంచి ఓ మూలకణాన్ని సృష్టిస్తారు. ఆపై వై క్రోమోజోమ్‌ను డిలీట్ చేస్తారు. ఎక్స్​ క్రోమోజోమ్‌ను డూప్లికేట్​ చేసి.. అది గుడ్డుగా మారేలా చేస్తారన్నమాట.

మనుషులపై ప్రయోగాలకు సిద్ధం!

‘మేం ఎక్స్​ క్రోమోజోమ్​ను నకిలి చేయడానికి ఒక నూతన వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఈ టెక్నిక్‌లను వినియోగించి 600 ఇంప్లాంట్‌లను తయారు చేశాం. అయితే అందులో ఏడు పిల్లలు మాత్రమే పుట్టాయి. అవి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నాయి’ అని సైంటిస్టులు తెలిపారు. ఇదే టెక్నిక్​ను మనుషులపై ప్రయోగించేందుకు రెడీ అవుతున్నట్లుగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త హయాషి తెలిపారు. రాబోయే పది సంవత్సరాలలో ఇది సాధ్యం కావచ్చని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

జ్యోతిరావు పూలేకు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైయ‌స్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -