Sunday, May 31, 2026

ఆప‌రేష‌న్ సింధూర్‌పై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

Must Read

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్తాన్ సైన్యంపై భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌పై వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్ర దాడి ఘటనకు భార‌త‌ సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంస‌లు కురిపించారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్‌ సింధూర్‌ ప్రారంభించాయ‌ని, మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంద‌ని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల‌ని, దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాల‌ని కోరారు. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తామ‌ని చెబుతూ.. జైహింద్ అని పోస్టు చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -