Monday, December 9, 2024

వైఎస్ జగన్ సంచలన నిర్ణయం

Must Read

ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న వేళ.. వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందున ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావొద్దని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్‌ భేటీ కానున్నారు. మాక్ అసెంబ్లీ నిర్వహించి కూటమి వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది. పది రోజుల పాటు నిర్వహించేందుకు యోచిస్తోంది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అటు శాసనమండలిలో మంత్రి అచ్చెం నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -