Monday, April 27, 2026

చెన్నై పర్యటనలో వైఎస్‌ జగన్

Must Read

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్సార్‌ సేవాదళ్‌ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జాహీర్‌ హుస్సేన్‌తో పాటు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భార్య వైఎస్‌ భారతి రెడ్డి, సోదరుడు అనిల్‌రెడ్డితో కలిసి బోట్‌ క్లబ్‌ రోడ్డుకు బయలుదేరిన ఆయనకు మార్గమధ్యంలో అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. బోట్‌ క్లబ్‌లో ఇండియా సిమెంట్స్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాసన్‌ నివాసాన్ని సందర్శించిన తర్వాత, ఇంజంబాక్కంలోని సోదరుడు అనిల్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా అభిమానులు తరలిరావడంతో పోలీసులు కట్టడి చర్యలు చేపట్టారు. సాయంత్రం తేనాంపేటలో సోదరుడు సునీల్‌ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన జగన్‌, అనంతరం ఇంజంబాక్కులో బస చేశారు. శుక్రవారం ఉదయం ఉత్తండిలో సునీల్‌ రెడ్డి నివాసంలో జరిగే కుటుంబ కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -