తెలంగాణలో వైన్ షాపుల టెండర్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అనేకమంది పోటీపడుతున్నారు. ఓ మహిళ రెండు వైన్ షాపులు దక్కించుకుంది. వ్యాపార అనుభవం లేకపోయినా ఆనందంలో మునిగిపోయింది. మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొని రెండు దుకాణాలు పొందింది. రెండు దుకాణాలకు దరఖాస్తు చేసి లక్కీ డ్రాలో విజేత అయింది. నిర్మల్ జిల్లా కేంద్రం నివాసి గుర్రాల హారిక లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లో దుకాణాలు వేసింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా జరిగింది. స్థానికులు లక్కీ లేడీ అంటూ అభినందించారు.

