Friday, January 24, 2025

తెలంగాణ అసెంబ్లీలో అంతా గందరగోళం..!

Must Read

– స్పీకర్ పై కాగితాలు విసిరారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
– తమపై చెప్పులు విసిరారని ఆరోపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం ముందుకు దూసుకొచ్చారు. కేటీఆర్ పై కేసు నమోదు నేపథ్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. దళితుడైన స్పీకర్ ను బీఆర్ఎస్ అవమానిస్తోందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ తమపై చెప్పులు విసిరారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా, అసెంబ్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -