Monday, December 9, 2024

వికారాబాద్ కలెక్టర్ పై దాడి

Must Read

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై గ్రామస్తులు దాడి చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ అభివృద్ధిలో భాగంగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. దీనిపై కొద్ది రోజులుగా గ్రామస్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాగా, ఫార్మా కంపెనీ ఏర్పాటుపై సోమవారం గ్రామ సభ నిర్వహించారు. అయితే, గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో సభ ఏర్పాటు చేయడం, భూములు ఇవ్వడానికి గ్రామస్తులు సిద్ధంగా లేకపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. సభను బహిష్కరిస్తూ రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిని కూడా కొట్టారు. మూడు వాహనాలు ధ్వంసం చేశారు. కలెక్టర్ కారు అద్దాలు కూడా పగలగొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -