Sunday, May 31, 2026

భార‌త్ చేరుకున్న జేడీ వాన్స్ దంప‌తులు

Must Read

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ మేర‌కు నేడు ఉద‌య‌మే వారు భార‌త్‌కు చేరుకున్నారు. వారికి భార‌త అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జేడి వాన్స్.. తొలిసారి భారత పర్యటనకు వ‌చ్చారు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్, భారత సంతతికి చెందిన మొదటి అమెరికన్ మహిళ కావడం విశేషం. భారత పర్యటనలో భాగం గా జేడి వాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావే శమై, భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వాణిజ్య ఒప్పం దాలు, భౌగోళిక రాజకీయ అంశాలు, ఇండో-పసిఫిక్ భద్రత, ఏఐ, డ్రోన్ టెక్నాల జీలపై చర్చలు జరపనున్నారు.
భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకమైనదిగా జేడి వాన్స్ భారత్ పర్యటనను భావిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు నాలుగు రోజుల పాటు వారు భారత్‌లో పర్యటించ‌నున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -