Tuesday, July 8, 2025

పాకిస్తాన్ స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో హైఅల‌ర్ట్

Must Read

భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య ప‌రిస్థితులు తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో పాకిస్తాన్‌తో సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్ర‌క‌టించింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో హై అల‌ర్ట్ కొన‌సాగుతోంది. ఢిల్లీ, హర్యానా బెంగాల్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు పాలనాధికారులను సెలవుల‌ను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేశారు. గుజరాత్‌ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌, హమీపుర్‌ ఉనా బిలాస్‌పుర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూ, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఎలాంటి ప్రయాణాలు చేయొద్దని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కేర‌ళ‌లో నిఫా వైర‌స్‌తో ఇద్ద‌రి మృతి

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెంద‌డం ఆందోళ‌న‌కు క‌లిగిస్తోంది. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -