కశ్మీర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్‌లో చేరిన తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) 2016 లో బీఎస్ఎఫ్ లో చేరాడు. మూడేళ్లుగా కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో పని చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి కారణంగా మూడు రోజుల కిందట తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, మంగళవారం నాగరాజు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. నాగరాజు కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులంతా గుండెలు బాదుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.