Friday, October 9, 2026

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్

Must Read

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు గతంలో రద్దు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఊరట లభించలేదు. పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవో 105తో పాటు పురపాలక శాఖ ఉత్తర్వులపై వివాదం కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నిబంధనలకు ప్రభుత్వ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. బీసీల రిజర్వేషన్ల కోసం కొత్తగా చేపట్టిన అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ప్రభుత్వ గణాంకాలు శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవన్న అభిప్రాయంతో పిటిషన్‌ను కొట్టివేసింది.

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. హైకోర్టు నిర్దేశించిన గడువులోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తెలిపినట్లు సమాచారం. ఓటర్ల జాబితాల విషయంలోనూ న్యాయస్థానం సూచనలు చేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయితే కొత్త జాబితాను, అప్పటికి పూర్తికాకపోతే పాత జాబితాను ఉపయోగించాలని సూచించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి అందుబాటులో ఉన్న జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించే అంశంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -