Wednesday, October 14, 2026

విశాఖలో జూదం ఆడుతున్న ఆరు మహిళలు అరెస్ట్‌

Must Read

విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. లలితానగర్‌ ప్రాంతంలో మహిళలు జూదంలో పాల్గొంటున్నారన్న సమాచారంతో నాలుగో పట్టణ పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో మహిళలు కూడా జూదక్రీడల్లో పాల్పడటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -