- మహిళా ఉద్యోగులకు అసభ్యకర మెసేజ్ లు
సత్యవీడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు మరో మిత్రుడు తోడయ్యాడు. అతను కూడా టీడీపీ చెందిన వాడే. పేరు కొలికపూడి శ్రీనివాస్. తిరువూరు ఎమ్మెల్యే. అమరావతి రైతు ఉద్యమం పేరుతో వార్తల్లోకి ఎక్కిన కొలికపూడి శ్రీనివాస్ కు చంద్రబాబే
తెలుగుదేశం నుంచి టికెట్ ఇచ్చాడు. కూటమి ఊపులో గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి దిగజారి వ్యవహరిస్తున్నాడు. మహిళా ఉద్యోగులకు అసభ్యకర మెసేజ్ లు పెడుతూ వేధిస్తున్నారు. ఇసుక, మైనింగ్,రేషన్ బియ్యం, గ్రావెల్ దందాలకు పాల్పడుతున్నాడు. అడ్డువచ్చిన వారిని అంతుచూస్తానని బెదిరిస్తున్నాడు. పార్టీ కేడర్ ను చిన్నచూపు చూస్తున్నాడు. ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. ఆ పార్టీ అధ్యక్షులు, పెద్దలు పిలిచి మందలించారు. కొలికపూడి వివరణతో సంతృప్తి చెందలేదు. చంద్రబాబు కూడా కొలికపూడిపై గుర్రుగా ఉన్నారు. చివరకు తిరువూరు మొత్తం కొలికపూడిపై తిరగడే పరిస్థితి వచ్చింది. ఆదిమూలం వలె కొలికపూడిని కూడా సస్పెండ్ చేస్తారా? లేదా పార్టీలో కొనసాగిస్తారా? తెలియాల్సి ఉంది.