ఇటీవల సికింద్రాబాద్ లో ఓ దుండగుడి చేతిలో ధ్వంసమైన ముత్యాలమ్మ విగ్రహాన్ని మంగళవారం పునర్ ప్రతిష్ఠించారు. మూడు రోజుల పాటు పూజలు నిర్వహించి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించనున్నారు. తొలిరోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం హాజరయ్యారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం నిర్వహించారు. ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా బస్తీ వాసుల సమక్షంలో పూజలు జరిగాయి. ఉద్రిక్తతలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పూజలు చేశారు.