తనపై తన కూతురు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.ఈ లేఖలో తన కూతురు క్రాంతి చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. తన చిన్న కొడుకు గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. తన కొడుకును తనకు దూరం చేస్తే తన కూతురు దగ్గరికి వెళ్తానని అనుకుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని జన్మలెత్తినా ఆ ఇంటికి నేను వెళ్లను అని స్పష్టం చేశారు. తనకు క్యాన్సర్ అని, ఇంట్లో బంధించి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పడం బాధాకరమన్నారు. తనకు వయసురీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలే తప్ప మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవన్నారు. తనపై వస్తున్న అసత్యపు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని కోరారు.