Monday, June 1, 2026

మోదీ కర్మయోగి, దేశ సేవలో అంకితం: పవన్ కల్యాణ్

Must Read

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవకు అంకితమైన కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. మోదీ రెండు తరాలను నడిపిస్తూ ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించారని, దేశ జెండాను ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టారని పవన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లకు పైగా బలంగా నిలిచి, రాబోయే తరాల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో అందరం సమష్టిగా పనిచేస్తామని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -