Wednesday, October 14, 2026

హిజ్రాల రక్షణకు తమిళనాడులో ‘అరణ్’ వసతి గృహాలు

Must Read

తమిళనాడు ప్రభుత్వం హిజ్రా సముదాయం వ్యక్తులపై జరిగే దాడులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ‘అరణ్’ (రక్షణ) పేరుతో వసతి గృహాలను ప్రవేశపెట్టింది. తొలి విడతలో చెన్నై మరియు మదురైలో రెండు గృహాలను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో అవసరాలను బట్టి ఈ గృహాల సంఖ్యను పెంచనున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మంది ఉండేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సమాజంలో అభద్రతాభావం, వివక్ష, వెలివేత, వేధింపులకు గురైన హిజ్రాలు లేదా అనాథలుగా మిగిలినవారు గుర్తింపు కార్డు చూపించి ఈ గృహాల్లో ఉచిత వసతిని పొందవచ్చు. బాధితుల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం కౌన్సెలింగ్ బృందాలను నియమించింది. ఈ గృహాల్లో ఆహారం, దుస్తులతో పాటు చదువుకునే సౌకర్యాన్ని సామాజిక సంక్షేమం మరియు మహిళా సాధికారత శాఖ కల్పిస్తోంది. అవసరమైన వారికి న్యాయ సాయం కూడా అందించనున్నారు. ఈ వసతి గృహాల్లో 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -