Saturday, October 17, 2026

రూ.4 కోట్ల ఆస్తి ప‌త్రాలు హుండీలో వేసిన వ్య‌క్తి

Must Read

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్య‌క్తి రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాల‌ను ఆల‌యంలోని హుండీలో వేసిన సంఘ‌ట‌న తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు త‌మ ఆస్తి ప‌త్రాల‌ను తిరిగి ఇవ్వాల‌ని ఆ వ్య‌క్తి భార్య, కుమార్తెలు ఆలయ అధికారులను వేడుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పడవేడుకు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు విజయన్, ఆయన భార్య కస్తూరి కొంతకాలంగా కుటుంబ కలహాలతో విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విజ‌య‌న్ రేణుకాంబాల్ ఆలయ హుండీలో రూ.4 కోట్ల విలువైన త‌మ‌ ఆస్తి పత్రాలను వేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు ఆలయ అధికారులను క‌లిసి ఆస్తి పత్రాలు తిరిగివ్వాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆలయ అధికారులు విజ‌య‌న్ కుటుంబ‌స‌భ్యుల‌కు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -