Monday, December 9, 2024

వడ్లు ఎందుకు కొంటలేవు చిట్టి నాయుడు?

Must Read

రాష్ట్రంలో వరి కోతలు మొదలైనప్పటికీ.. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లు లేవు.. రైతు భరోసా లేదు.. అని విమర్శించారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయిందని.. పూర్తి నష్టపరిహారంలో వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నామని చెప్పి.. అక్టోబర్ 28 నాటికి వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్నారు. దళారులతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదన్నారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నాడని విమర్శించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -