Friday, August 29, 2025

తెలంగాణలో భారీ వర్షాల బీభత్సం

Must Read

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం వణికిపోతోంది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. గత 36 గంటల్లో కామారెడ్డిలో 500-600 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వర్షాల తీవ్రత కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. మంజీరా నది, కల్యాణి వాగు ఉప్పొంగడంతో పరిసర గ్రామాలు నీట మునిగాయి. వందలాది ఎకరాల పంటలు నాశనం అయ్యాయి.

ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలు:
11 జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ హెచ్చరికలు జారీ అయ్యాయి. భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, కొమురంభీం, నిజామాబాద్‌, సంగారెడ్డి, వికారాబాద్‌. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో రహదారులపై రాకపోకల‌కు అస్తవ్యస్తంగా మారింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

ప్రత్యేక చర్యలు:
కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితి విషమంగా ఉండటంతో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి. మెదక్ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం జిల్లాల్లో కూడా నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో ఒక్కరోజులోనే 32.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.రాబోయే గంటల్లో ఉరుములు, మెరుపులు, గాలివానలతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. నీటిముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. వర్షం కొనసాగితే వరద పరిస్థితి మరింత ఉధృతం కానుందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -