ఈనెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు భరోసా’ సాయాన్ని అందజేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. అంటే రూ.5,500 కోట్ల నుంచి రూ.6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.