Friday, January 24, 2025

కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

Must Read

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజుతో కలిసి బన్నీ ఆస్పత్రి లోపలికి వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్న అల్లు అర్జున్‌.. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌తోనూ మాట్లాడారు. ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లొద్దని లీగల్‌ టీమ్‌ చెప్పడంతో శ్రీతేజ్‌ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -